Sunday 3 April 2011

జీవితం




 కొత్త మంది జీవితంలో  ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు  మూడీగా ఉంటారు. మరి కొంత మంది ఎప్పుడూ  హుషారుగా ఉంటారు. మరి వాళ్లకు సమస్యలు లేవా అంటే ఉంటాయి, కానీ వాళ్ళు స్పోర్టివ్ గా తీసుకొంటారు. ప్రతీ మనిషి జీవితం లో ఏదో ఒక దాన్ని మిస్ అవుతూనే ఉంటారు.. అంత మాత్రాన అది మనకు లేదే అనుకుని ఏడుస్తూ కూర్చుంటే   వచ్చేది ఏమీ ఉండదు. మన ప్రయత్నం మనం చెయ్యాలి..అంత వరకే మన బాధ్యత.

జీవితం ఎవరికీ నల్లేరు మీద నడక లాగా ఉండదు. ఈ రోజుల్లో చాలా మందికి ఉండే అభిప్రాయం డబ్బు సంపాదిస్తే చాలు సుఖపడిపోవచ్చు అనుకొంటారు. దాని కోసం పాపం వాళ్ళు రాత్రనకా పగలనకా శ్రమిస్తారు.. డబ్బు కోసం జీవితాన్ని త్యాగం చేస్తారు. చిన్న చిన్న ఆనందాల్ని వదులుకొంటారు. 

నాకు తెలిసిన ఒక పెద్ద మనిషి తన జీవితం లో చాలా కష్టపడ్డాడు. అతనికి ఇద్దరు మగ పిల్లలు.. ఇద్దరినీ బాగా ఖర్చు పెట్టి అమెరికాలో చదివించాడు. పెద్ద మేడ కట్టుకున్నాడు. ఆ కాలనీ లో అతనే గొప్పవాడు అందరికన్నా. పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు. ఆ పెద్ద మనిషి తన జీవితంలో 60 ఏళ్ళవరకు డబ్బు కోసం అన్నింటినీ  మిస్ చేసుకొన్నాడు.

ఇప్పుడు బాగా డబ్బుంది, కానీ ఏం లాభం? ఏదైన జబ్బు చేస్తే పక్కంటి వాళ్ళో , ఎదురింటి వాళ్ళో జాలి పడి వచ్చి చూస్తారు, కానీ తను కన్న పిల్లలు రాలేరు. వాళ్ళు ఇక్కడికి చిన్న చిన్న విషయాలకు రాలేరు..వీళ్ళు అక్కడికి వెళ్ళలేరు. అయన ఒక్కసారి జీవితంలోకి వెనక్కి తిరిగి చూసుకొంటే అంతా శూన్యం. 

డబ్బు సంపాదించాల్సిందే, కానీ అదే జీవితం అనుకోకండి. అదే ఆరాటం లో పడి చిన్న చిన్న ఆనందాల్ని వదులుకోకండి.. ..మీకోసం మీరు జీవించండీ.



ఉగాది




హిందువుల పండుగలలో నాకు ఇష్టమైనవి ఉగాది..దీపావళి. ఉగాది పచ్చడి లో నిజ జీవితం లో చవి చూచే అన్ని రుచులు కనిపిస్తే...దీపావళి లో జీవితంలో ఉండే చీకటి వెలుగులు కనిపిస్తాయి ..అందుకే నిజ జీవితానికి దగ్గరగా ఉండే ఈ రెండు పండగలు నాకు బాగా ఇష్టం. నా మిత్రులందరికీ ":శ్రీ ఖర" నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు..ఉగాది పచ్చడి అసలయిన రుచి ఏమిటి అంటే చేదు. ఇది జీవితానికి బాగా వర్తిస్తుంది..మన జీవితం లో కొన్ని చేదు సంఘటనలు ఉంటే వాటిని కూడా తియ్యటి సంఘటనలతో కలిపి స్వీకరిద్దాం..ఏమంటారు మిత్రులారా ? ..