Sunday 3 April 2011

జీవితం




 కొత్త మంది జీవితంలో  ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు  మూడీగా ఉంటారు. మరి కొంత మంది ఎప్పుడూ  హుషారుగా ఉంటారు. మరి వాళ్లకు సమస్యలు లేవా అంటే ఉంటాయి, కానీ వాళ్ళు స్పోర్టివ్ గా తీసుకొంటారు. ప్రతీ మనిషి జీవితం లో ఏదో ఒక దాన్ని మిస్ అవుతూనే ఉంటారు.. అంత మాత్రాన అది మనకు లేదే అనుకుని ఏడుస్తూ కూర్చుంటే   వచ్చేది ఏమీ ఉండదు. మన ప్రయత్నం మనం చెయ్యాలి..అంత వరకే మన బాధ్యత.

జీవితం ఎవరికీ నల్లేరు మీద నడక లాగా ఉండదు. ఈ రోజుల్లో చాలా మందికి ఉండే అభిప్రాయం డబ్బు సంపాదిస్తే చాలు సుఖపడిపోవచ్చు అనుకొంటారు. దాని కోసం పాపం వాళ్ళు రాత్రనకా పగలనకా శ్రమిస్తారు.. డబ్బు కోసం జీవితాన్ని త్యాగం చేస్తారు. చిన్న చిన్న ఆనందాల్ని వదులుకొంటారు. 

నాకు తెలిసిన ఒక పెద్ద మనిషి తన జీవితం లో చాలా కష్టపడ్డాడు. అతనికి ఇద్దరు మగ పిల్లలు.. ఇద్దరినీ బాగా ఖర్చు పెట్టి అమెరికాలో చదివించాడు. పెద్ద మేడ కట్టుకున్నాడు. ఆ కాలనీ లో అతనే గొప్పవాడు అందరికన్నా. పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు. ఆ పెద్ద మనిషి తన జీవితంలో 60 ఏళ్ళవరకు డబ్బు కోసం అన్నింటినీ  మిస్ చేసుకొన్నాడు.

ఇప్పుడు బాగా డబ్బుంది, కానీ ఏం లాభం? ఏదైన జబ్బు చేస్తే పక్కంటి వాళ్ళో , ఎదురింటి వాళ్ళో జాలి పడి వచ్చి చూస్తారు, కానీ తను కన్న పిల్లలు రాలేరు. వాళ్ళు ఇక్కడికి చిన్న చిన్న విషయాలకు రాలేరు..వీళ్ళు అక్కడికి వెళ్ళలేరు. అయన ఒక్కసారి జీవితంలోకి వెనక్కి తిరిగి చూసుకొంటే అంతా శూన్యం. 

డబ్బు సంపాదించాల్సిందే, కానీ అదే జీవితం అనుకోకండి. అదే ఆరాటం లో పడి చిన్న చిన్న ఆనందాల్ని వదులుకోకండి.. ..మీకోసం మీరు జీవించండీ.



ఉగాది




హిందువుల పండుగలలో నాకు ఇష్టమైనవి ఉగాది..దీపావళి. ఉగాది పచ్చడి లో నిజ జీవితం లో చవి చూచే అన్ని రుచులు కనిపిస్తే...దీపావళి లో జీవితంలో ఉండే చీకటి వెలుగులు కనిపిస్తాయి ..అందుకే నిజ జీవితానికి దగ్గరగా ఉండే ఈ రెండు పండగలు నాకు బాగా ఇష్టం. నా మిత్రులందరికీ ":శ్రీ ఖర" నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు..ఉగాది పచ్చడి అసలయిన రుచి ఏమిటి అంటే చేదు. ఇది జీవితానికి బాగా వర్తిస్తుంది..మన జీవితం లో కొన్ని చేదు సంఘటనలు ఉంటే వాటిని కూడా తియ్యటి సంఘటనలతో కలిపి స్వీకరిద్దాం..ఏమంటారు మిత్రులారా ? ..



Thursday 24 March 2011

ఉపేంద్ర





ఈ మద్య ఉపేంద్ర సినిమా చూశాను .. ఉపేంద్ర  అందరిలాంటి  డైరెక్టర్ కాదు.. ఒక  విలక్షణ నటుడు, డైరెక్టర్ కూడా..ఒక మంచి సందేశం ఉన్న సినిమా తీశాడు.. మన దేశం లో ప్రజలు.. ఈ దేశం మనది కాదు ప్రభుత్వానిది అని అనుకొంటారట .. అందుకే ఈ దేశం లో ఏం జరిగినా  అది మన బాధ్యత  కాదు అని కూడా అనుకుంటారట.. ఇది నమ్మలేని నిజం...ఒక వెరైటీ  సినిమా తీసిన ఉపేంద్రను అభినందించాలి..వీలైతే మీరు కూడా ఈ సినిమా చూడండి..వెరైటీ కోరుకునే వారికి బాగా నచ్చుతుంది ఈ సినిమా..



Friday 18 March 2011

అలా జరిగింది


ఈ మధ్య నెల్లూరు (కృష్ణపట్నం ) లో ఎక్కువగా ఉంటున్నా బిజినెస్ పని మీద .. అసలు మేము హైదరాబాద్ లో సెటిల్ అయిన విజయవాడ వాళ్ళం..సరే అలా ఒక రోజున నెల్లూరు మెయిన్ బజార్ లో తిరుగుతూ ఒక స్వీట్ షాప్ కి వెళ్లి స్వీట్స్ ఎంత అని  అడిగాను  షాప్ అతన్ని...ఆయన కాలు 55 రూపాయలు అన్నాడు.



నాకేమి అర్ధం కాలేదు ఆయన చెప్పింది..మళ్ళీ  అడిగాను..మళ్ళీ  అదే చెప్పాడు..బాబు నేను అడిగింది స్వీట్స్ గురించి అన్నా.. ఆయన కూడా అంతే మర్యాదగా నేను చెప్పింది స్వీట్స్ గురించే అన్నాడు...ఎందుకయినా మంచిది అని కొనకుండా వెనక్కి వచ్చేశా.

కృష్ణపట్నం వెళ్ళిన తరువాత ఒకాయన్ని అడిగా..నేను స్వీట్స్ అడిగితే ఆయన కాలు రేట్ చెప్తాడేంటి  అని ? అప్పుడు ఆయన చెప్పాడు కాలు అంటే పావు కేజీ అని..అబ్బ భయపడి పోయాను కాలు అంటే.. 

అలా జరిగింది స్వీట్స్ షాపింగ్.



Friday 11 March 2011

ఫస్ట్ లేడీస్


జయ గారి బ్లాగ్ మనస్వి లో చక్కటి టపా..’ఫస్ట్ లేడీస్’..తప్పక చదవండి.




Wednesday 9 March 2011

మహిళా దినోత్సవం




మహిళల్లారా...మహిళా దినోత్సవం చేసుకొని సంబరపడకండి. ముందు ఆలోచన విధానాలను మార్చుకోండి. మనం 21 వ శతాబ్దం లో ఉన్నామని మర్చిపోకండి. ఇప్పుటి స్త్రీలకు కావలసింది సగటు టీవీ సీరియల్స్ , వ్యాసరచన పోటీలు, వంటల పోటీలు కాదు...సమాజం తో పోటి పడాలి. మగవాళ్ళతో పోటి పడాలి. పిరికితనాన్ని వదిలెయ్యాలి.. ఛాందస భావాలను వీడండి. ఆధునిక స్త్రీ లాగా ఉండండి. మల్లాది సుబ్బమ్మ, మేధా పాట్కర్ , ఇందిరా గాంధీ , జయలలిత, కల్పనా చావ్లా, అరుంధతి రాయ్ , చందన కోచార్, ఇంద్ర నూయి, వీళ్ళంతా స్త్రీలే... కానీ ఎలా సమాజం లో పోటిపడి ముందుకు వెళ్ళారో చూడండి.. వీళ్ళ నుండి స్పూర్తి పొందండి...ఇది స్త్రీ వాదం కాదు. స్త్ర్రేలను విజయం వైపు నడిపించే వాదం.