ఈ మద్య ఉపేంద్ర సినిమా చూశాను .. ఉపేంద్ర అందరిలాంటి డైరెక్టర్ కాదు.. ఒక విలక్షణ నటుడు, డైరెక్టర్ కూడా..ఒక మంచి సందేశం ఉన్న సినిమా తీశాడు.. మన దేశం లో ప్రజలు.. ఈ దేశం మనది కాదు ప్రభుత్వానిది అని అనుకొంటారట .. అందుకే ఈ దేశం లో ఏం జరిగినా అది మన బాధ్యత కాదు అని కూడా అనుకుంటారట.. ఇది నమ్మలేని నిజం...ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్రను అభినందించాలి..వీలైతే మీరు కూడా ఈ సినిమా చూడండి..వెరైటీ కోరుకునే వారికి బాగా నచ్చుతుంది ఈ సినిమా..
Thursday, 24 March 2011
Friday, 18 March 2011
అలా జరిగింది
ఈ మధ్య నెల్లూరు (కృష్ణపట్నం ) లో ఎక్కువగా ఉంటున్నా బిజినెస్ పని మీద .. అసలు మేము హైదరాబాద్ లో సెటిల్ అయిన విజయవాడ వాళ్ళం..సరే అలా ఒక రోజున నెల్లూరు మెయిన్ బజార్ లో తిరుగుతూ ఒక స్వీట్ షాప్ కి వెళ్లి స్వీట్స్ ఎంత అని అడిగాను షాప్ అతన్ని...ఆయన కాలు 55 రూపాయలు అన్నాడు.
నాకేమి అర్ధం కాలేదు ఆయన చెప్పింది..మళ్ళీ అడిగాను..మళ్ళీ అదే చెప్పాడు..బాబు నేను అడిగింది స్వీట్స్ గురించి అన్నా.. ఆయన కూడా అంతే మర్యాదగా నేను చెప్పింది స్వీట్స్ గురించే అన్నాడు...ఎందుకయినా మంచిది అని కొనకుండా వెనక్కి వచ్చేశా.
కృష్ణపట్నం వెళ్ళిన తరువాత ఒకాయన్ని అడిగా..నేను స్వీట్స్ అడిగితే ఆయన కాలు రేట్ చెప్తాడేంటి అని ? అప్పుడు ఆయన చెప్పాడు కాలు అంటే పావు కేజీ అని..అబ్బ భయపడి పోయాను కాలు అంటే..
అలా జరిగింది స్వీట్స్ షాపింగ్.
Friday, 11 March 2011
Wednesday, 9 March 2011
మహిళా దినోత్సవం
మహిళల్లారా...మహిళా దినోత్సవం చేసుకొని సంబరపడకండి. ముందు ఆలోచన విధానాలను మార్చుకోండి. మనం 21 వ శతాబ్దం లో ఉన్నామని మర్చిపోకండి. ఇప్పుటి స్త్రీలకు కావలసింది సగటు టీవీ సీరియల్స్ , వ్యాసరచన పోటీలు, వంటల పోటీలు కాదు...సమాజం తో పోటి పడాలి. మగవాళ్ళతో పోటి పడాలి. పిరికితనాన్ని వదిలెయ్యాలి.. ఛాందస భావాలను వీడండి. ఆధునిక స్త్రీ లాగా ఉండండి. మల్లాది సుబ్బమ్మ, మేధా పాట్కర్ , ఇందిరా గాంధీ , జయలలిత, కల్పనా చావ్లా, అరుంధతి రాయ్ , చందన కోచార్, ఇంద్ర నూయి, వీళ్ళంతా స్త్రీలే... కానీ ఎలా సమాజం లో పోటిపడి ముందుకు వెళ్ళారో చూడండి.. వీళ్ళ నుండి స్పూర్తి పొందండి...ఇది స్త్రీ వాదం కాదు. స్త్ర్రేలను విజయం వైపు నడిపించే వాదం.
Subscribe to:
Posts (Atom)